ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల రంగంలో భారత్‌కు దన్నుగా నిలవాలని బ్యాంకు భావిస్తోంది. ఈ మేరకు ప్రపంచబ్యాంకు కంట్రీ డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్యాకేజీ అని ప్రపంచ బ్యాంకు తెలిపింది. దీంతో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. కోవిడ్-19, లాక్‌డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఈ ప్రకటన ఊరట నిచ్చింది.