కోవిడ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని ఆస్పత్రుల్లో చేరడానికి వణికిపోతున్నారు ప్రజలు.. అయితే, కోవిడ్ బాధితులను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు 4000 కోవిడ్ కేర్ కోచ్‌లను ఏర్పాటు చేసింది.. ఈ కోచ్‌ల ద్వారా దాదాపు 64 వేల పడకలు సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతం 169 బోగీలను వివిధ రాష్ట్రాలకు అప్పగించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాష్ట్రాల డిమాండ్ మేరకు ఇండోర్ సమీపంలోని నాగ్‌పూర్, భోపాల్, తిహి కోసం కోవిడ్ కేర్ కోచ్‌లను రైల్వే సమీకరించింది.