పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:36 IST)
Nirmala sitaraman
పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 
 
పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ.. కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీరేటుపై 0.7 శాతం, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ వడ్డీరేటుపై 0.9 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్‌పై 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 
 
వడ్డీరేట్లను 1.1 శాతం వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జారీ చేసిన ఉత్వర్వులను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 2020-21 చివరి త్రైమాసికం ప్రకారమే వడ్డీరేట్లు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు