పీఎన్బీ స్కామ్: నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు

ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (18:21 IST)
పీఎన్బీ స్కామ్‌లో విచారణ ఎదుర్కొనేందుకు భారత్‌కు రాకుండా విదేశాల్లో గడుపుతున్న నీరవ్ మోదీ మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. పీఎన్బీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ పలుమార్లు కోరినప్పటికీ వారు తిరస్కరించారు. తమకు వ్యాపారపరంగా ఉన్న ఎంగేజ్‌మెంట్స్, ఆరోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేకపోతున్నామని నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ గతంలో చెప్తూ వచ్చారు.
 
అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేయడం ద్వారా ఇంటర్ పోల్ కూడా స్పందించి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి రూ.11,400 కోట్లకు ఐపీ పెట్టి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు