ప్రస్తుతం ఐపీఎల్లో మార్మోగిపోతున్న పేరు సామ్ కర్రాన్.. ఈ యువకెరటం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరపున ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి ఓటమి దిశగా సాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. కొన్నేళ్ల క్రితం విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్‌గేల్‌తో సామ్ దిగిన ఫొటోను ప్రస్తుతం గేల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం క్రిస్‌గేల్ మరియు కర్రన్ ఇద్దరూ పంజాబ్ జట్టులో ఉండటం విశేషం. ఢిల్లీతో మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ను పక్కన పెట్టడంతో కర్రన్ తుదిజట్టులోకి వచ్చాడు. సామ్ కర్రాన్ పాఠశాలకు వెళ్లే వయసులో స్కూల్ యూనిఫాంలో ఉన్నప్పుడు కొన్నేళ్ల క్రితం గేల్‌పై అభిమానంతో ఫోటో దిగాడు. తాజాగా ఐపీఎల్లో పంజాబ్‌కు ఆడుతుండగా గేల్‌తో మరోసారి యువ క్రికెటర్ ఫోటో దిగాడు. ఈ రెండు ఫోటోలను జతచేసిన గేల్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అప్పుడు.. ఇప్పుడు సామ్ భలే ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు.