2010లో రాజస్తాన్ రాయల్స్, 2011-12 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్, 2013లో పుణే వారియర్స్, 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్, 2016,17లో గుజరాత్ లయన్స్, 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఫించ్ ఆడాడు.
ఇకపోతే... గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్కరమ్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడంతో కోల్‌కతా నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. ఈ పరాజయంతో కోల్‌కతా నాలుగో స్థానానికి పడిపోయింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుట్ కాగా, మార్కరమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబాద్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.