ఇకపోతే.. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రక డే అండ్ నైట్ టెస్టు విజయవంతంగా ముగిసింది. ఈ టెస్టును బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ సంఘం విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ను దగ్గర నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని బాధ్యతలు తీసుకుని విజయవంతం చేశారు. అతిథులను కూడా గౌరవించారు. ఈ పోరులో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అలాగే విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు వరుసగా నాలుగు ఇన్నింగ్స్ విజయాలతో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది.