నిజానికి ఈ జాబితాలో టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ మొదటిస్థానం దక్కించుకున్నాడు. ఇతని బ్రాండ్ విలువ 37.2 మిలియన్ డాలర్లు. అలాగే, క్రికెటర్లలో టాప్-10లో చోటుదక్కించుకున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే.
ఫెదరర్ తర్వాతి స్థానాల్లో బాస్కెట్ బాల్ ఆటగాడు లిబ్రాన్ జేమ్స్, స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్, ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, గోల్ఫ్ ఆటగాళ్లు ఫిల్ మెకెల్‌సన్, టైగర్ వుడ్స్ ఉన్నారు. ప్రచారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే ఫోర్బ్స్ పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను విడుదల చేసింది.