వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
వేప ఆకు పదార్దాలు లేదా రసం గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి.
వేప పుల్లలతో దంతాలను తోముకుంటుంటే అది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.