పనసకాయలు వచ్చే కాలం ఇది. పనస తొనలను ఎంతో ఇష్టంగా తింటుంటారు చాలామంది. ఐతే ఈ పనస కాయలను కొంతమంది తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. ముఖ్యంగా అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినకూడదు.
సహజంగా చెట్టుకు పండిన కాయను అలా తినేయకుండా ఇంట్లో ఒకటిరెండ్రు రోజులు నిలువపెట్టుకుని తింటే రుచిగా వుంటుంది. ఐతే ఈ పనస కాయల తొనలను అధికంగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్ష రెండూ కలిపి సారాలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. మరికొన్ని ఉపయోగాలు చూద్దాం.
1. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.