ఇంట్లో కొన్ని రకాల కూరల్లో కొత్తిమీరకు వాడుతుంటారు. ముఖ్యంగా రసంపాటు.. చికెన్, మటన్ వంటి కూరల తయారీలో దీన్ని క్రమం తప్పకుండా వాడుతారు. ఈ కొత్తిమీర వాడటం వల్ల కూరలకు మంచి రుచి వస్తుంది. అంతేకాదు, కొత్తిమీరను అలాగే నేరుగా కూరగా చేసుకున్నా లేదా పచ్చడిగా చేసుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది.
అయితే నిజానికి కొత్తిమీరను కొన్ని వేల సంవత్సరాల కిందటే వినియోగంలోకి తెచ్చారు. ఈ మొక్క మంచి వాసనను ఇస్తుంది. కొత్తిమీరలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రోటీన్లు, విటమిన్లు, లవణాలు, లోహాలు ఉంటాయి. అందుకే ఈ కొత్తిమీరను త్రిదోష హరిణి అని కూడా అంటారు. ఈ క్రమంలోనే కొత్తిమీరను నిత్యం వాడడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* జీర్ణ సమస్యలను నివారించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది.