అయితే, ఈ డ్రోన్ దాడి నుంచి ప్రధాని అల్ కమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, ఆయన రక్షణ సిబ్బంది పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హింస చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
పైగా, ఇక్కడ అనేక ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ప్రధాని నివాసంపై దాడి ఆరోగ్యకరం కాదని ఇరాక్ మిలటరీ పేర్కొంది. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ప్రధాని సురక్షితంగా ఉన్నారని, అందరూ సంయమనం పాటించాలని ప్రధాని ట్విట్టర్ ఖాతా పేర్కొంది.