గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

సెల్వి

శనివారం, 19 ఏప్రియల్ 2025 (15:02 IST)
BMW Car
సాంకేతిక దృక్పథంతో చూసినప్పుడు, గూగుల్ మ్యాప్స్ ఒక అసాధారణ ఆవిష్కరణ. అంతరిక్షంలో పరిభ్రమించే ఉపగ్రహాలు భూమిపై ఉన్న ప్రజలకు నావిగేషన్‌ను అందించగలగడం సాధారణ విషయం కాదు. అయితే, సాంకేతిక విషాల్లో లోపాలు సాధారణమే. గూగుల్ మ్యాప్స్ కూడా దీనికి మినహాయింపు కాదు.
 
గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం కొన్నిసార్లు ఊహించని గమ్యస్థానాలకు దారితీయవచ్చు. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వ్యక్తులు సరస్సులు లేదా అడవుల్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సగం నిర్మించిన రోడ్లపై పూర్తిగా యాప్‌పై ఆధారపడి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా ఇండోనేషియాలో, ఒక జంట గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి తమ మార్గాన్ని నావిగేట్ చేస్తున్నారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత, వారి బీఎండబ్ల్యూ కారు ఒక వంతెనపైకి దూసుకెళ్లింది. కానీ వారు ముందుకు వెళ్తుండగా, వాహనం అకస్మాత్తుగా నిర్మాణంపై నుండి పడిపోయింది. 
 
కారణం.. వంతెన పాక్షికంగా మాత్రమే నిర్మించబడింది. ఆ కారు లాంగ్ జంప్ చేసినట్లుగా కిందకు పడిపోయింది. ఒక్కసారిగా బ్రిడ్జ్‌పై నుంచి కింద ఉన్న రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తూ, ఇండోనేషియా జంట స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Another Google Maps Fiasco- Couple in Indonesia drives off unfinished highway by
following Google Maps pic.twitter.com/Cy1Rro33L4

— Rosy (@rose_k01) April 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు