జో బైడెన్ డిజిటిల్ టీమ్‌లో కాశ్మీర్ మహిళా టెక్కీకి చోటు!

మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:31 IST)
అమెరికా 46వ దేశ అధ్యక్షుడుగా జో బైడెన్ వచ్చే నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే కార్యాచరణలో నిమగ్నమైవున్న జో బైడెన్.. వివిధ రకాలైన పాలనా బృందాల్లో నిష్ణాతులైన వారిని చేర్చుకుంటున్నారు. ఇలాంటి బృందాల్లో భారతీయ సంతతికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. తాజాగా జో బైడెన్ డిజిటల్ బృందంలో ఆయన కాశ్మీరీ యువతికి కీలక స్థానం కల్పించారు. 
 
శ్వేత‌సౌధానికి చెందిన డిజిట‌ల్ స్ట్రాట‌జీ బృందంలో భార‌త్‌కు చెందిన యువ‌తికి ఉన్న‌త ప‌ద‌వి ద‌క్కింది. కాశ్మీర్‌లో పుట్టిన అయేషా షాకు డిజిట‌ల్ స్ట్రాట‌జీ బృందానికి పార్ట్న‌ర్‌షిప్‌ మేనేజ‌ర్‌గా నియ‌మితురాలైంది. డిజిట‌ల్ స్ట్రాట‌జీ డైర‌క్ట‌ర్‌గా రాబ్ ఫ‌హ‌ర్టీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. లూజియానాకు చెందిన అయేషా.. గ‌తంలో బైడెన్‌-హారిస్ క్యాంపేన్ కోసం డిజిట‌ల్ పార్ట్న‌ర్‌షిప్ మేనేజ‌ర్‌గా చేశారు. 
 
ప్ర‌స్తుతం ఆమె స్నిగ్‌సోనియ‌ర్ ఇన్స్‌టిట్యూట్‌కు అడ్వాన్స్‌మెంట్ స్పెష‌లిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. జాన్ ఎఫ్ కెన్నడీ సెంట‌ర్‌లో ఆమె కార్పొరేట్ ఫండ్ అసిస్టెంట్ మేనేజ‌ర్‌గా కూడా చేసింది. బ‌యో మార్కెటింగ్ సంస్థ‌లోనూ ఆమె స్ట్రాట‌జిక్ క‌మ్యూనికేష‌న్స్ స్పెష‌లిస్టుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింది. భిన్న రంగాల్లో నిపుణులైన వారిని డిజిటిల్ స్ట్రాట‌జీ టీమ్‌లోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు