ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్‌లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పజ్ఞ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో నివసిస్తోంది. ప్రజ్ఞ మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్కు థాయిలాండ్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్న కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా వివరించారు.
బ్యాంకాంగ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్న కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్‌లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఆమె కుటుంబీకులకు వెంటనే పాస్ పోర్టును ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు.