జపాన్ దేశంలోనూ వైరస్ కొత్త వెర్షన్ రూపం మార్చుకుని దాడి చేయడం మొదలుపెట్టింది. దీంతో జపాన్‌లో కలకలం రేగింది. నిన్న మొన్నటి దాకా బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ కొత్త వెర్షన్లో వెలుగులోకి వచ్చింది.
జపాన్‌లో వెలుగులోకి వచ్చిన వైరస్ అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల వైరస్ కన్నా భిన్నంగా ఉందని అక్కడి వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌ను బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో గుర్తించినట్లు వివరణ ఇచ్చింది. ఈ ఇద్దరికి మొదట ఎలాంటి లక్షణాలు లేవు. కొన్ని రోజులకు వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడడంతో ఆస్పత్రిలో చేరాడు.
అక్కడ పరీక్షలు చేయగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని నిర్ధారించారు. అనంతరం రెండో వ్యక్తికి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. దీంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక వైద్యం అందిస్తోంది. ఈ వైరస్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని శాస్త్రవేత్తలు, వైద్యులను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది.
జపాన్‌లో ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ కేసులు 30 వరకు ఉన్నాయి. 2,80 వేల కేసులు నమోదవగా, 4 వేల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.