ఇకపై ఇంటెలిజెన్స్ సహకారాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నామని పాక్ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ స్పష్టం చేశారు. పాక్ భూభాగంపై స్థావరాలను ఏర్పాటు చేసుకుని, ఐఎస్ఐ అందించే నిఘా నివేదికల ఆధారంగా ఆఫ్గనిస్థాన్ ఉగ్రవాదులపై యూఎస్ సైన్యం దాడులు నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే.