రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా ధ్రువీకరించారు. రోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా ఉందని చెప్పారు. కొన్ని రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నానని... డాక్టర్ల సలహా మేరకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... టెస్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు.