వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ బీజేపీ ఎంపీ. ఆయన తండ్రి రాధాకృష్ణ విఖే పాటిల్ కూడా అప్పట్లో మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. అయితే, సుజయ్ పాటిల్ కుమార్తె 10 ఏండ్ల అనీష పాటిల్ గత కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని అనుకుంది.
తండ్రికి చెబితే మోదీ చాలా బిజీగా ఉంటారని, అపాయింట్‌మెంట్ ఇవ్వలేరని నచ్చజెప్పారు. దాంతో తానే మోదీ మెయిల్‌కు లేఖ రాసింది. 'నేను మిమ్మల్ని నిజంగా కలవాలనుకుంటున్నాను' అని సింపుల్‌గా లేఖలో తెలిపింది. ఇది చూసిన మోదీ తనను కలిసేందుకు ఆమెను ఆహ్వానించారు.