వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశ ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఐతే రాజస్థాన్ కోటాకు చెందిన ముర్తజా ఏ అహ్మద్ భారీ సాయం ప్రకటించి అమరవీరుల కుటుంబాల పట్ల దాతృత్వాన్ని చూపారు.
రూ. 110 కోట్లను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈయన అంధులైనప్పటికీ శాస్త్ర పరిశోధనలో వినూత్న ఆవిష్కరణలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆధునాతన టెక్నాలజీని త్వరలో ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. మరోవైపు భారీ విరాళం ప్రకటించిన ఆయనను ఆ దేవుడు చల్లగా వుండాలని అంటున్నారు.