మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భర్త.. భార్యను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముమ్మలంపట్టి గ్రామానికి చెందిన హరికృష్ణ రైల్వేలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య తంగమారి, ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అదే గ్రామానికి చెందిన రైతు పెరుమాల్‌కు తంగమారితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిపై భర్త, బంధువులు ఎన్నోసార్లు హెచ్చరించినా తంగమారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో హరికృష్ణ ఇంటికి వచ్చాడు. అతను రాత్రి నిద్రకు ఉపక్రమిస్తుండగా, భార్య తంగమారి పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చింది. దాన్ని తాగినట్లుగా హరికృష్ణ నటించాడు.