పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఘటన నెట్టింట వైరల్ అయ్యింది. ఒక మహిళా ప్రొఫెసర్ తరగతి గదిలో ఒక విద్యార్థినిని వివాహం చేసుకుంటూ కనిపించారు. ఇద్దరూ పూల దండలు మార్చుకుంటూ, ఆ విద్యార్థి ప్రొఫెసర్ నుదిటిపై సింధూరం పెట్టడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోపై వర్శిటీ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అనంతరం అధికారులు ప్రొఫెసర్‌ను సెలవుపై ఉంచారు. స్టూడెంట్‌ను సస్పెండ్ చేశారు.