జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఠాగూర్

సోమవారం, 10 మార్చి 2025 (10:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంహౌలోని జామా మసీదు ప్రాంతంలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో భారత్ విజయం సాధించింది. 
 
ఈ విజయం తర్వాత భారత్‌లోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఎంహౌలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదుగా సాగింది. మసీదు ప్రాంతం నుంచి వెళుతుండగా సమీపంలోని గుంపు ర్యాలీపై రాళ్లు విసిరింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసం చేశారు. రెండు దుకాణాలు, రెండు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందిని మొహరించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 

 

Rioting has erupted in Mhow following a victory parade celebrating India's win in the ICC Champions Trophy final as it went past the Jama Masjid. Stone pelting and arson have left many injured. Indore SP Wasal has reached the spot. Forces have now been deployed. Please stay safe. pic.twitter.com/AGSiYLBgMw

— Anand Ranganathan (@ARanganathan72) March 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు