ప్రపంచ మదుపరుల సదస్సు : భోజన ప్లేట్ల కోసం ఎగబడ్డారు (Video)

ఠాగూర్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (16:53 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి. ముఖ్యంగా, భోజన ఏర్పాట్లలో ఈ సమస్య కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో ఈ సదస్సుకు వచ్చిన సామాన్య ప్రజలు భోజల ప్లేట్ల కోసం ఒక్కసారిగా ఎగడ్డారు. ఒకానొక సందర్భంగా వీటికోసం వారు కొట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 
ఈ సదస్సుకు అతిథులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు. దీంతో కొన్నిప్లేట్లు విరిగికిందపడ్డాయి. ఈ దృశ్యాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచ సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడ్డారు. కాగా, ఈ సదస్సు ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగింది. ఇందులో తమ రాష్ట్రంలో రూ.26.16 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. ఈ ప్రతిపాదిత ఒప్పందాల్లో అమలైతే రాష్ట్రంలో 17.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

 

Are these "Global" investors in Bhopal???
????????????????

- Madhya Pradesh – Global Investors Summit 2025 pic.twitter.com/yREFgmGDwI

— Prateek (@pratbrat) February 26, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు