రాహుల్ గాంధీ హిందువు కాదా?

బుధవారం, 29 నవంబరు 2017 (19:42 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదానికి తెరతీశారు. దీనికి కారణం కూడా ఆయనే. ఇదే అదనుగా బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అసలు రాహుల్ ఎలాంటి వివాదంలో చిక్కుకున్నారో పరిశీలిద్ధాం. 
 
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అక్కడ హిందువులు కానివారు మాత్రమే అక్కడున్న రిజిస్టర్‌లో తమ వివరాలు రాస్తారు. కానీ రాహుల్ మాత్రం ఆలయ పరిసరాల్లోకి వెళ్లిన తర్వాత లోపలికి వెళ్లడానికి అక్కడి ఆలయ పాలకమండలి సభ్యులను ప్రత్యేకంగా అనుమతి కోరారు. రిజిస్టర్‌లో ఎంట్రీ చేశారు. దీంతో తాను హిందువు కాదా? అన్న కొత్త అనుమానాలకు రాహుల్ తెరలేపినట్లయింది. 
 
రిజిస్టర్‌లో రాహుల్ గాంధీ మీడియా కోఆర్డినేటర్ వివరాలను రాశారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన వెంట గుడిని సందర్శించిన అహ్మద్ పటేల్ వివరాలను కూడా ఆయన రిజిస్టర్‌లో పొందుపరిచారు. రెండు రోజుల సోమ్‌నాథ్ పర్యటనలో భాగంగా రాహుల్.. గిర్ సోమ్‌నాథ్, అమ్రేలీ, భావనగర్ జిల్లాల్లో తిరిగి పలు సభల్లో పాల్గొననున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు