భార్యకు ఇష్టంలేకపోయినా, అంగీకరించకపోయినా, ఆమెను భర్త బలవంతంగా శృంగారం చేస్తే అది నేరం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ముఖ్యంగా, భార్యతో చేసే బలవంతపు శృంగారం, అసహజ లైంగిక చర్యలు నేరాలు కాబోవని తాజాగా తీర్పునిచ్చింది. అయితే, భార్య వయసు 18 యేళ్ల పైబడి వుంటే ఆమెతో లైంగిక సంబంధం నెరపేందుకు ఆమె సమ్మతి పొందాల్సిన అవసరం భర్తకు లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
2017లో ఓ వ్యక్తి భార్య అనుమతి తీసుకోకుండానే ఆమెతో అసహజ లైంగిక చర్యలు నెరిపాడు. ఆ కారణంగా ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయినా వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. బలవంతపు శృంగారం కారణంగానే తన ఆరోగ్యం పాడైనట్టు మరణ వాంగ్మూలం ఇచ్చింది. పోస్టుమార్టం చేసిన వైద్యులు కూడా దీన్ని ధృవీకరిస్తూ నివేదిక ఇచ్చారు.