బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండితో సాయంతో... (Video)

ఠాగూర్

మంగళవారం, 31 డిశెంబరు 2024 (20:00 IST)
ఖరీదైన కారుతో సముద్రతీరంలో చక్కర్లు కొడుతున్న ఇద్దరు బడాబాబులకు ఓ వింత అనుభవం ఎదురైంది. తాము ప్రయాణిస్తున్న లగ్జరీ కారు సముద్రపు ఇసుకలో కూరుకునిపోయింది. ఆ కారును రోడ్డుకు తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు తమ వల్ల కాక... ఓ ఎడ్ల బండి సాయం తీసుకున్నారు. లగ్జరీ కారును ఎడ్లబండికి కట్టి తీరానికి లాక్కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఓ బీచ్‌లో చోటుచేసుకుంది.
 
ముంబైకు చెందిన ఇద్దరు వ్యక్తులు.. తమ ఫెరారీ కారులో రాయ్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌కు వెళ్లారు. అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బీచ్‌లో ముందుకుసాగిపోయారు. ఈ క్రమంలో కారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో అక్కడున్నవారంతా వచ్చి వాహనాన్ని బయటకు లాగే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
అదేసమయంలో అటుగా వెళ్తున్న ఓ ఎడ్లబండి వీరి కంటపడటంతో సాయం కోరారు. ఫెరారీ కారు ముందుభాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండిని ముందుకు పోనిచ్చారు. ఇలా లగ్జరీ కారు ఎట్టకేలకు బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

 

Bull Power > Horsepower!

A Ferrari got stuck on Revdanda Beach, and guess what saved it? A bullock cart! When horsepower failed, bull power stepped in like a boss.#Ferrari #RevdandaBeach #Bulls #horsepower pic.twitter.com/jXxGVnksSA

— Sneha Mordani (@snehamordani) December 31, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు