సత్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు: కేబినెట్

FILE
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది.

గురువారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులకు ప్రతినెల రూ. 200 వృద్ధాప్య పించను ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న అంటువ్యాధుల నియంత్రణకు కార్యచరణ రూపొందించాలని కేబినెట్ తీర్మానించింది. జిల్లా కలెక్టర్ల పనిభారం తగ్గించేందుకు రంగారెడ్డి జిల్లా మినహా 22 జిల్లాల్లో అదనపు జాయింట్ కలెక్టర్ల నియామకాలపై కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి