30-08-2019- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. దైవదర్శనాలు అతికష్టం మీద..?
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (10:34 IST)
మేషం: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సొంతంగా వ్యాపారం లేక ఏదైనా సంస్థ నెలకొల్పాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఉద్యోగాభివృద్ధి కోసం చేసే యత్నం ఫలిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం: స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో అనుకూలం. హోటలు, తినుబండ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. లిటిగేషన్ వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
మిధునం: కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంతమంచిది కాదని గమనించండి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టం మీద అనుకూలిస్తాయి.
కర్కాటకం: మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కాని పనులు నెరవేరవు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలు తమ సరదాలు, కోరిక వాయిదా వేసుకుంటారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. సాఫ్ట్వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు.
సింహం: వ్యాపార, వ్యవహారాలలో దక్షత చూపుతారు. రాతకోతల విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచూసుకోండి. విదేశాలు వెళ్లటానికి మీరు చేయు ప్రయత్నాలు విఫలమౌతాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు, ఆలోచనలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
కన్య: రాజకాయాలలోని వారు కొన్ని అంశాలపై చర్చలు జరుపుట వల్ల విజయం వరిస్తుంది. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు అధికం అవుతున్నారని గమనించండి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు.
తుల: స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. ధనం సమయానికి అందటం వల్ల సంతృప్తి కానవస్తుంది. రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలం.
వృశ్చికం: ఒక్కోసారిధనం ఎంత వ్యయం చేసినా ప్రయోజనం ఉండదు. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టింపు లెదురవుతాయి. స్త్రీలు ఆడంబరాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
ధనస్సు: పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. గృహమునకు కావలసిన వస్తువులను కొంటారు. మీ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు చికాకులు తప్పవు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
మకరం: వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మీ సృజనాత్మక శక్తకి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. దైవ, పుణ్య కార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.
కుంభం: మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్య రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. పత్రికా రంగంలోని వారికి నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశం కలిసివస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
మీనం: భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. రాజకీయాలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసి పోతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.