తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు వచ్చే భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగించనున్నారు.