Kidnap: మూడేళ్ల బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిన దుండగుడు (video)

సెల్వి

గురువారం, 6 మార్చి 2025 (11:21 IST)
Kidnap
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసిన వీడియో బయటకు వచ్చింది. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా బాలుడు అపహరణకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం సమయంలో బాలుడిని దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.  బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. 
 
గత మూడేళ్లుగా ఆసుపత్రి ఆవరణలోనే బాధిత కుటుంబం నివాసం ఉంటోంది. ఆస్పత్రిలో ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని ఓ దుండగుడు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లాడు. అయితే తమ కుమారుడు కనిపించట్లేదనే కంగారుతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ మేరకు బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు.

సీసీటీవీ ఫుటేజ్

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ కలకలం

మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగుడు

4వ తేదీన మధ్యాహ్నం సమయంలో బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు

కిడ్నాప్ జరిగినా పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది

గత మూడేళ్ళుగా ఆసుపత్రి ఆవరణలోనే నివాసం ఉంటున్న… pic.twitter.com/rspIYkUjmY

— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు