థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

ఠాగూర్

శనివారం, 3 మే 2025 (20:04 IST)
అందరి ముందు తనను దూషించి నా ఇజ్జత్ తీశాడంటూ ఓ రైతు ట్రాక్టర్‌కు నిప్పు పెట్టాడు. ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ గ్రామానికి చెందిన గడ్డం రవి అనే రైతు రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.98 వేలు చొప్పున నెలసరి వాయిదాల్లో చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల రూ.80 వేలు చెల్లించగా, మిగిలిన రూ.18 వేలు చెల్లించాలని ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు రవి ఇంటికి వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన రవి.. ఏజెంట్లు తనను దూషించి ఇజ్జత్ తీశాడంటూ ట్రాక్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు.. ట్రాక్టర్ కు నిప్పు పెట్టిన రైతు..

రెండేళ్ల క్రితం ఫైనాన్స్ లో ట్రాక్టర్ కొనుగోలు చేసిన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ మండలం చేగుంట గ్రామానికి చెందిన గడ్డం రవి

ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.98 వేల చొప్పున EMI కడుతున్న రవి

ఈ నెల రూ.80 వేలు కట్టగా..… pic.twitter.com/BKK9UVvVKq

— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు