తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. ఈయనకు ఈడీ నోటీసుల పేరుతో నకిలీ లేఖలు వచ్చాయి. అందులో గంగుల సోదరుడిని అరెస్టు చేయనున్నట్టు ఉంది.
ఈ విషయం ఈడీ దృష్టికి రావడంతో ఆ విభాగం అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ నకిలీ నోటీసుకు సంబంధించి మంత్రి కమలాకర్ నుంచి ఫిర్యాదు అందాల్సివుందని తెలిపారు.
మరోవైపు, మంత్రికి నకిలీ నోటీసులు పంపిన దుండగులు.. ఈడీతో మాట్లాడి, సెటిల్ చేస్తామంటూ ఓ వ్యక్తితో ఫోన్ చేయించడం గమనార్హం. ఇపుడు గుర్తు తెలియని వ్యక్తి ఆ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు సైబర్‌క్రైమ్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.