హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ..!

సోమవారం, 9 మే 2022 (17:39 IST)
KTR
హైదరాబాద్ కేంద్రంగా మల్టీనేషనల్ కంపెనీలు కొనసాగుతున్నాయి. లియోనార్డ్ లివ్ స్కిట్జ్, సీఈవో  గ్రిడ్ డైనమిక్స్ యూఎస్ మరియు ఐరోపా సంస్థలకు చెందిన అధికారులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. తద్వారా గ్రిడ్ డైనమిక్స్ భారతదేశంలో తన మొదటి సంస్థను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకు గాను హైదరాబాదును వేదికగా ఎంచుకుంది.  
 
తద్వారా హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ ఐటీ సంస్థ కాలుమోపినట్లైంది. అమెరికా స‌హా యూరోప్ వ్యాప్తంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న డిజిట‌ల్ ట్రాన్స్‌ఫార్మేష‌న్ దిగ్గ‌జం గ్రిడ్ డైన‌మిక్స్ తాజాగా హైద‌రాబాద్‌లో త‌న కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.
 
ఈ మేర‌కు సోమ‌వారం గ్రిడ్ డైన‌మిక్స్ సీఈఓ లియోనార్డ్ లివ్‌సిజ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. భార‌త్‌లోనే త‌న తొలి కార్యాల‌యాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా లియోనార్డ్ తెలిపారు. ఈ ఏడాది చివ‌రి నాటికి 1,000 మంది ఉద్యోగుల‌తో కూడిన కార్యాల‌యాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు