నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కి పిచ్చి కుక్క కరిచి... పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో రోహింగ్యాలు లేరు.. ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. ఇతర దేశాస్థులు భారత దేశంలోకి ప్రవేశిస్తున్నారంటే ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఫైర్ అయ్యారు. దేశంలో బిజెపి ప్రభుత్వ నిఘా వ్యవస్థ, భద్రత వ్యవస్థ విఫలమైందని.. అందుకే ఇతర దేశాస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘతం కల్గిస్తున్నారని మండిపడ్డారు.