కాగా, ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి జాతరలో నీలం రంగుతో చీరతోకూడిన పంచె కట్టుకుని డాన్స్ వేసే సాంగ్ కూడా విడుదల విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఓ కథ బయట హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ముగింపులో అల్లు అర్జున్ చనిపోయాడో, కనపడకుండా పోయాడో అనే ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఓ అటవీ ప్రాంతంలో గాయాలతో గిరిజనులకు దొరడంతో వారి పూజించే అమ్మవారిని దగ్గర పెట్టి చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఓ సందర్భంలో ఓ పాటను తెరకెక్కించారట. అది కూడా కాంతార తరహాలో రిషబ్ శెట్టి చేసిన శైలిలో డ్రెస్ తో పాట వుంటుంది. ఇది సినిమాకు హైప్ చెప్పించేవిధంగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ఫార్మెట్ లో దర్శకుడు సుకుమార్ ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేశాడని, ఆటవికుల ఆచారవ్యవహాలను బాగా స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషల్లో 6 డిసెంబర్ 2024న విడుదల కానుంది.