ఈమధ్య నటి సమంత సోషల్ మీడియానుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తెలుస్తోంది. ఆమె వైవాహిక జీవితంనుంచి బయటకు వచ్చాక ఆమె రెక్కలువచ్చినా పక్షిలా అన్ని ప్రాంతాలను పర్యటిస్తోంది. గుడులు, గోపురాలు తిరుగుతూ తనస్నేహితులతో హల్ చల్ చేస్తుంది. ఇక తన వ్యక్తిగతాన్ని విమర్శించిన వారిపైన కూడా కేసులు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె లాయర్ ఇచ్చిన సలహా, సోషల్ మీడియాకూ దూరంగా వుండమని. దాంతో ఇక సోషల్ మీడియాకూ దూరం అవుతుందనే వార్త బయటకు వచ్చింది.