తొలి భారతీయ చిత్రంగా "సరైనోడు".. మరి 'బాహుబలి'?

మంగళవారం, 17 జులై 2018 (10:37 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "సరైనోడు". ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అదీ కూడా భారతీయ చలన చిత్ర రికార్డులు తిరగరాసిన 'బాహుబలి' చిత్రం కూడా అందుకోని సరికొత్త రికార్డును చేరుకుంది. ఈ చిత్ర హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌‌లో 20 కోట్ల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. యూట్యూబ్‌‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'సరైనోడు' కావడం విశేషం.
 
నిజానికి 'సరైనోడు' చిత్రం హిందీ వెర్షన్‌ యూట్యూబ్‌ హక్కులను గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ దక్కించుకుంది. ఇప్పటివరకు చిత్రాన్ని 20 కోట్ల 11 లక్షల 13 వేల 361 మంది వీక్షించారు. కాగా దీనిని 6 లక్షల 67 వేల మంది లైక్‌ చేశారు. విశేషమేమిటంటే.. గతంలో ఏ భారతీయ చిత్రమూ (బాహుబలి కూడా) సాధించని రికార్డును 'సరైనోడు' సొంతం చేసుకుంది.
 
కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూ.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.127కోట్లు వసూలు చేసింది. పూర్తి మాస్‌‌ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ అదరగొట్టగా, ఇపుడు సరికొత్త చరిత్రను సృష్టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు