బాలీవుడ్ కిల్ వంటి పలు చిత్రాల్లో నటించిన రాఘవ్ జుయల్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. సెషన్‌లో దర్శకుడు వివరించిన ముడి దృశ్యాలను చూసి రాఘవ్ ఉత్సాహంగా ఉన్నాడు. అతను త్వరలో సెట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్చి 26, 2026లో థియేటర్లలో విడుదలకాబోతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలలో విడుదలవుతోంది.
SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ విడుదలై అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. నాని నెవర్ బిఫోర్ లుక్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.