ఒకటి రెండు సార్లు అయితే ఓకే. ప్రతిసారీ సినిమా సెట్ పైకి వచ్చేవరకు చాలాసార్లు అలాచేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడని నేను ఒకసారి అడిగేశా. దానికిఆయన సమాధానం చాలా బాగా నచ్చింది. ఈ పాత్రకోసం దాదాపు 27 కేజీలు పెరగాలి. కండలు రావాలి. నిన్ను మామూలుగా చూస్తే తెలియదు. అందుకే అలా చేశానని అనడంతో నాకు మైండ్ బ్లాక్ అయింది. సారీ సార్..అంటూ మనసులో అనుకుని ఆయన విజన్ కు నేను హాట్సాఫ్ చెప్పుకున్నారు.
ఇక అలాగే రష్మిక మందన్న విక్కీ భార్యగా నటించింది. రాణిగా నటించడమంటే మామూలుగా కాస్ట్యూమ్స్ తో మేనేజ్ చేస్తే సరిపోదు. అప్పటి కాలానికి చెందిన భాష, యాస, మాడ్యులేషన్ నేర్చుకోవడానికి నెలలునెలలు పట్టింది. ఇది ఈ సినిమాలో నేను చాలా నేర్చుకున్నది. డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. డబ్బింగ్ చూసి దర్శకుడు, హీరో కూడా అభినందుల తెలపడంతో అప్పుడు నా పాత్రపై పూర్తి నమ్మకం కలిగిందని చెప్పింది.
ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన రష్మిక, విక్కీ మాట్లాడారు. కౌశల్ పోషించిన మరాఠా రాజు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందిన చారిత్రక యాక్షన్ చిత్రం. ఇది శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ఛవా యొక్క అనుకరణ. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిలింస్ పతాకంపై దినేష్ విజన్ నిర్మించారు. అక్షయ్ ఖన్నా కూడా నటించారు.