హైదరాబాద్: ఏషియన్ ఇ ఎన్ టి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వినికిడి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందన్నారు డా. చావా ఆంజనేయులు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వినికిడి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నగరంలో అనేక ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున్న ప్రజలు పాల్గొని వినికిడికి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఏషియన్ ఎన్ టి హాస్పిటల్ ఎండి, ఇ ఎన్ టి సర్జన్ డా. చావా ఆంజనేయులు మాట్లాడారు. నగరంలో ప్రస్తుత పరిస్థుల్లో విపరీతమైన శబ్ధ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. సాధారణంగా ఎక్కువ సమయం రోడ్ల మీద తిరుగుతుండడంతో ప్రజలు శబ్ద కాలుష్కానికి గురువుతున్నారని అన్నారు.
ఈ ఉచిత వినికిడి వైద్య శిబిరంలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్ద వయసుల వారికి వినికిడి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్ వినియోగం తగ్గించాన్నారు. అదేపనిగా ఫోన్లు చూడడం వల్ల, కంటిచూపుతో పాటు, వినికిడి సమస్యలు కూడా వస్తాయన్నారు. వినికిడి సమస్యలు ఉన్నవారికి అవసరమైన చికిత్సల గురించి సలహాలు, సూచనలు చేశామన్నారు.
చిన్న పిల్లల్లో, పెద్దవారిలో వినికిడి సమస్య తీవ్రంగా ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఏవిధంగా పని చేస్తుందో వివరించామన్నారు. వివిధ రకాల చికిత్సల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. దాదాపు 500 పైగా మందికి ఉచిత పరీక్షలు చేశామని తెలిపారు. ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజలకు ఉపయోపడుతాయన్నారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలు తేలిని వారికి కచ్చితమైన పరిష్కారారికి కావాల్సిన చికిత్సల గురించి సమస్యలు ఉన్నవారు తెలసుకున్నారని అన్నారు.