విడాకులు రద్దు చేసుకోనున్న ధనుష్-ఐశ్వర్య

గురువారం, 6 అక్టోబరు 2022 (10:49 IST)
Dhanush-Aishwarya
తమిళ స్టార్ హీరో ధనుష్, ఆయన సతీమణి  ఐశ్వర్యా రజనీకాంత్ విడాకులను రద్దు చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్, ఐశ్వర్య విడాకులను క్యాన్సిల్ చేసుకోనున్నారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఉన్న‌ట్టుండి ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు విడిపోయేందుకు నిర్ణ‌యించుకున్నారు. 
 
ఇటీవల ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా 2003లో ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వ‌ర్య‌ను ధ‌నుష్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు కూడా ఉన్నారు. విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న నేప‌థ్యంలో పిల్ల‌లిద్ద‌రూ ధ‌నుష్ వ‌ద్దే ఉంటున్నారు. 
 
అయితే ఏమైందో తెలియ‌దు గానీ... కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసిన విడాకుల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌లు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా బుధ‌వారం వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌పై అటు ధ‌నుష్ ఫ్యాన్స్‌తో పాటు ర‌జ‌నీ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు