తెలంగాణ స్విమ్మర్స్‌ అగ్ర జబితాలో గౌతమ్‌ ఘట్టమనేని

గురువారం, 17 జూన్ 2021 (18:54 IST)
Gautam Ghattamaneni
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని ‘ఒన్ (నేనొక్కడినే)’ చిత్రంతో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.తాత సూపర్‌స్టార్‌ కృష్ణ, తండ్రి మహేశ్‌బాబుల నుంచి సహజంగానే నటనలో నైపుణ్యాన్ని అల‌వ‌ర‌చుకున్న గౌతమ్‌ ఇటు స్విమ్మింగ్‌లోనూ ప్రావీణ్యత చూపిస్తున్నాడు. 2018నుంచి ప్రొఫెషనల్‌ స్విమ్మింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు గౌతమ్‌.

తెలంగాణ స్టేట్‌ స్విమ్మింగ్‌కు సంబంధించి తన ఏజ్‌ గ్రూప్‌ విభాగంలోని టాప్‌ 8 పొజిషన్స్‌లో ఒకరిగా నిలిచారు గౌతమ్‌. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి, నటి–నిర్మాత నమ్రత సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరచారు. గౌతమ్‌ స్విమ్‌ చేస్తున్న ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. అలాగే గౌతమ్‌ కోచ్‌లలో ఒకరైన ఆయూష్‌ యాదవ్‌తో గౌతమ్‌ ఉన్న ఫోటోను ఈ సందర్భంగా నమత్ర రీ పోస్ట్‌ చేశారు.
 
‘‘2018 నుంచి ప్రొఫెషనల్‌ స్విమ్మర్‌గా గౌతమ్‌ సాధన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన ఏజ్‌ గ్రూప్‌కు చెందిన తెలంగాణలోని ప్రొఫెషనల్‌ స్విమ్మర్స్‌ టాప్‌ 8 జాబితాలో గౌతమ్‌ చోటు సంపాదించాడు. గౌతమ్‌ తనకు తానుగానే స్మిమ్మింగ్‌ను ఎంచుకున్నాడు. కష్టపడుతూ, సాధనలో తనకు ఎదురైన సవాళ్ళను స్వీకరిస్తూ వచ్చాడు. చక్కని స్విమ్మింగ్‌ మెళకువలకు కచ్చితమైన వేగాన్ని జోడించి తన నైపుణ్యానికి మరింత పదును పెట్టాడు గౌతమ్‌.

స్మిమ్మింగ్‌ బటర్‌ఫ్లైలో ఉన్న నాలుగు రకాలను (బటర్‌ ఫ్లై బ్యాక్‌స్ట్రోక్, బ్రీస్ట్‌ స్ట్రోక్, ఫ్రీ స్టైల్‌ విత్‌ ఈజ్‌ అండ్‌ గ్రేస్‌) గౌతమ్‌ చక్కగా ప్రదర్శించగలడు.వీటిలో గౌతమ్‌కు బటర్‌ఫ్లై ఫ్రీ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. ఈ స్టైల్లో గౌతమ్‌ కంటిన్యూస్‌గా మూడుగంటల్లో ఐదు కిలోమీటర్లు స్విమ్‌ చేయగలడు’’ అని నమ్రత పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో స్విమ్మింగ్‌లో గౌతమ్‌ మరింతగా రాణించి దేశానికి పతకాలు తేవాలని, తన తల్లిదండ్రులు మరింత గర్వపడేలా చేస్తాడని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు