Varalakshmi Sarath Kumar & Nikolai Sachdev
''రేపు నా బర్త్ డే. ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్నదే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయండి'అన్నారు హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్. రేపు(మార్చి5) వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే. ఈ సందర్భంగా కుటుంబంతో కలసి హైదరాబాద్ లోని లెప్రా సొసైటీ ఆర్ఫానేజ్ కి వెళ్లి చిన్నారులతో సమయాన్ని గడిపి, వారికి గిఫ్ట్స్ అందించారు. అనంతరం భర్త నికోలయ్ సచ్‌దేవ్ తో కలసి ఆర్ఫనేజ్ కి డొనేషన్ అందజేశారు.