చదువుకోమని హైదరాబాద్ పంపిస్తే ఇద్దరు పిల్లల తల్లితో లేచిపోయిన యువకుడు..

ఠాగూర్

ఆదివారం, 2 మార్చి 2025 (10:15 IST)
ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గోపి అనే యువకుడు ఇద్దరు పిల్లల తల్లితో లేచిపోయాడు. కంప్యూటర్ శిక్షణ తీసుకోమని తండ్రి డబ్బులు వెచ్చించి హైదరాబాద్ నగరానికి పంపితే, ఆ కుర్రోడు మాత్రం డేటింగ్ యాప్‌ సాయంతో ఇద్దరు పిల్లల తల్లిని వశపరుచుకుని ఆమెతో లేచిపోయాడు. దీనిపై ఆ మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఆ ప్రేమజంట కోసం గాలిస్తున్నారు. 
 
పల్నాడు జిల్లా మిరియం పల్లికి చెందిన పేరయ్య అనే వ్యక్తి గోపి అనే కుమారుడు ఉన్నాడు. కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ నగరానికి పంపించాడు. దీంతో కూకట్ పల్లి హౌసంగ్ బోర్డు హాస్టల్‌లో ఉంటూ వచ్చాడు. అయితే, తాను వచ్చిన పనిని విస్మరించి, డేటింగ్ యాప్‌ల ద్వారా అమ్మాయిల కోసం శోధించారు. ఈ క్రమలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా బావోజిగూడెంకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి సుకన్య అనే వివాహిత పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా ఫోనులో మాట్లాడుకోవడం ప్రారంభించారు. భార్య ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన ఆ మహిళ భర్త జయరాజ్.. భార్యను మందలించాడు. అయినప్పటికీ సుకన్యలో మార్పు రాకపోగా, తన ప్రియుడు గోపితో లేచిపోయేందుకు నిర్ణయించుకుంది. 
 
ఆ తర్వాత తన మనసులోని మాటను ప్రియుడు గోపికి చెప్పి, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి సుకన్య ఇంటి నుంచి పారిపోయింది. అయితే, కన్నతల్లి కోసం ఇద్దరు పిల్లలు ఏడుస్తుండటంతో జయరాజ్ వీరిద్దరిపై నిఘా ఉంచి, ఓ రోజున అడ్డుకున్నారు. కానీ, కళ్ళెదుట భర్త ఉన్నప్పటికీ సుకన్య తన ప్రియుడు కలిసి బైకులో పారిపోయింది. దీంతో జయరాజ్ హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, సుకన్య, గోపిలు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయడంతో వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు