మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొత్త అవతారం ఎత్తారు. కేరళలోని కొచ్చిలో కొత్త మేయర్‌గా ఎన్నికైన అనిల్ కుమార్.. ఇటీవల మమ్ముట్టిని ఆయన ఇంటిలో కలిశారు. ఈ విషయాన్ని అనిల్ తన ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. మమ్ముట్టిని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నా. సిటీ, ఆర్ట్స్, సినిమాతో పాటు మిగిలిన విషయాలపై మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాము అని కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోలో వైట్ కుర్తా, గడ్డంతో కనిపించాడు మమ్ముట్టి.