త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్- పవన్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి అజ్ఞాతవాసితో హిట్ కొట్టాలని సినీ యూనిట్ భావిస్తోంది.
కీర్తి సురేష్, అను ఇమాన్యుయేల్ పవన్‌కు జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, కుష్బూ, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. "కొడకా కోటేశ్వర్రావు" పూర్తి పాట వీడియో మీ కోసం...