పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఎస్జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ను విడుదల చేశారు.