ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రియాంకా 17 యేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటినుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఓ రోజున ఓ పెద్ద మనిషి వద్దకు తీసుకెళితే.. మీ అమ్మ కాసేపు బయట కూర్చొంటే నీకు కథ వినిపిస్తా అన్నాడు.
మా అమ్మ వినలేకపోయే కథతో నేను సినిమా ఎలా చేస్తాను అని ప్రియాంకా సున్నితంగా చెప్పేసింది. దానివల్ల ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశాన్ని ప్రియాంకా కోల్పోయింది. అలా దర్శకుల కోరికలు తీర్చకపోవడంతో ఓ పది సినిమాల్లో నటించే అవకాశాన్ని ఆమె కోల్పోయిందని చెప్పింది. బాలీవుడ్‌లో ఉన్నంతగా హాలీవుడ్‌లో లైంగిక వేధింపులు లేవని మధు చోప్రా చెప్పడం గమనార్హం.