నిన్నటికినిన్న నెల్లూరులోని సినిమా థియేటర్‌లోని టాయ్‌లెట్‌కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఇపుడు విజయనగరం జిల్లాలో సినిమాకు వెళ్లిన ఓ మహిళ.. టాయిలెట్‌కు వెళితే ఆ థియేటర్‌లో పని చేస్తే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక కోర్కె తీర్చాలంటూ చేయిపట్టుకుని లాగాడు. దీన్ని నిలదీసినందుకు ఆ మహిళ భర్తపై భౌతికదాడికి దిగాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఇప్పటికే పలు సర్వేలు చెపుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఆ సర్వేలు వెల్లడించిన విషయాలు నిజమని తేలుతున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని సౌందర్య థియేటర్ ఉంది. ఈ థియేటర్‌కు సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబసభ్యులతో కలిసి 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా చూసేందుకు వెళ్లారు. సినిమా మధ్యలో చైతన్య భార్య టాయిలెట్‌కు వెళ్లింది. అక్కడ పారిశుధ్య కార్మికుడు శుభ్రం చేసేందుకు నిల్చొనివున్నాడు.
లేడీస్ టాయిలెట్‌లో నీకేం పని అని ఆమె అడగడంతో ఆమె చెయ్యిపట్టుకుని కోర్కె తీర్చాలంటూ లాగాడు. దీంతో ఆమె భయంతో బయటకు పరుగుతీసి, తన భర్తకు విషయం వివరించింది. దీంతో అతనిని నిలదీసేందుకు వెళ్లాడు. అయితే, థియేటర్ సిబ్బంది మొత్తం ఏకమై చైతన్యపై దాడికి దిగారు. దీంతో అతనికి తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.